మహిళ గొంతు కోసి నగల అపహరణ | Woman robbed of Gold ornaments | Sakshi
Sakshi News home page

మహిళ గొంతు కోసి నగల అపహరణ

Nov 6 2015 4:19 PM | Updated on Aug 30 2018 5:27 PM

మహిళ గొంతు కోసి నగలు అపహరించిన ఘటన తిరుపతి పట్టణం చిన్న బజార్ వీధిలోని అడ్డా సందు వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

తిరుపతి (చిత్తూరు జిల్లా) : మహిళ గొంతు కోసి నగలు అపహరించిన ఘటన తిరుపతి పట్టణం చిన్న బజార్ వీధిలోని అడ్డా సందు వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దుండగుల దాడిలో గాయపడిన సుభాషిణి(35) అనే మహిళను చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె స్పృహలో లేదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement