వితంతువుపై లైంగిక దాడి | Widows of sexual assault | Sakshi
Sakshi News home page

వితంతువుపై లైంగిక దాడి

Jan 9 2014 3:01 AM | Updated on Jul 27 2018 2:18 PM

భార్య సహకారంతో ఓ వితంతువుపై భర్త లైంగిక దాడికి పాల్పడిన సంఘటనలో దంపతులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. సీఐ శంకర్‌రెడ్డి కథనం మేరకు.

పటాన్‌చెరు టౌన్, న్యూస్‌లైన్: భార్య సహకారంతో ఓ వితంతువుపై భర్త లైంగిక దాడికి పాల్పడిన సంఘటనలో దంపతులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. సీఐ శంకర్‌రెడ్డి కథనం మేరకు. పటాన్‌చెరు మండల పరిధిలోని చిన్నకంజర్ల గ్రామానికి చెందిన ఓ వితంతువు (35) వద్ద అదే గ్రామానికి చెందిన మంగలి నర్సింహ నెలలో డబ్బు ఇస్తానని ఆరేళ్ల క్రితం రూ. 30 వేలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బు ఇవ్వాలని పలుమార్లు కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మంగళవారం నరసింహ  పనిచేస్తున్న మంగలి దుకాణం వద్దకు వెళ్లిన డబ్బు ఇవ్వాలని బాధితురాలు డిమాండ్ చేసింది.
 
 అయితే తానే ఇంటికి వచ్చి మాట్లాడతానని అక్కడి నుంచి ఆమెను పంపేశాడు. అనంతరం అదే రోజు రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లి తన వద్ద డబ్బు లేదని, తరువాత ఇస్తానని చెప్పి ఆమెను ఒప్పించాడు. అనంతరం అక్కడి ఉండిపోయాడు. దీంతో నరసింహులు భార్య కూడా అక్కడికి చేరుకుంది. వీరి మధ్య ఏం జరిగిందో గాని నరసింహులుకు భార్య సహకరించడంతో వితంతువుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఈమేరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement