గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి లో జరిగింది.
గిరిజన పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి
Jan 5 2016 12:34 PM | Updated on Nov 9 2018 4:36 PM
మారేడుమిల్లి : గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి లో జరిగింది. మామిడిపల్లి గిరిజన సంక్షేమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నైనా శంకర్ మంగళవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందాడు. పాఠశాల వర్గాలు మాత్రం శంకర్‌కు గజ్జి, తామర శోకిందని దాని నివారణకు తీసుకున్న సిరఫ్ వికటించడంతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. అయితే విద్యార్థి మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


