చంద్రబాబు కారణంగానే అధికారం కోల్పోయాం: కిషన్ రెడ్డి | We lost power because of Chandra Babu Naidu: Kishan Reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కారణంగానే అధికారం కోల్పోయాం: కిషన్ రెడ్డి

Mar 26 2014 7:12 PM | Updated on Mar 29 2019 9:18 PM

చంద్రబాబు కారణంగానే అధికారం కోల్పోయాం: కిషన్ రెడ్డి - Sakshi

చంద్రబాబు కారణంగానే అధికారం కోల్పోయాం: కిషన్ రెడ్డి

పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పార్లమెంట్‌కు పోటి చేయడానికి సిద్ధమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పార్లమెంట్‌కు పోటి చేయడానికి సిద్ధమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని అన్నారు. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకైనా.. పార్లమెంటుకైనా పోటీ చేస్తానని ఆయన అన్నారు. 
 
పొత్తుల కోసం మేమెవ్వరినీ బతిమాలడం లేదని ఓ ప్రశ్నకు సమాధామిచ్చారు. పార్టీలతో పొత్తు వ్యవహారం కుదరకపోతే అన్ని స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కిషన్‌రెడ్డి అన్నారు.  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు పోవడం వల్లే గతంలో బీజేపీ కూడా అధికారం కోల్పోయిందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement