మంత్రుల టాయిలెట్లకు నీటి కొరత | Water shortage in andhra pradesh secretariat J Block | Sakshi
Sakshi News home page

మంత్రుల టాయిలెట్లకు నీటి కొరత

Sep 18 2014 12:42 PM | Updated on Sep 2 2017 1:35 PM

సామాన్యులకే కాదు....మంత్రులకు నీటి కష్టాలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రుల టాయిలెట్లకు నీటి కొరత ఏర్పడింది.

హైదరాబాద్ : సామాన్యులకే కాదు....మంత్రులకు నీటి కష్టాలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రుల టాయిలెట్లకు నీటి కొరత ఏర్పడింది. సచివాలయంలోని జే బ్లాక్లో నీటి సరఫరా నిలిచిపోయింది. జే బ్లాక్ తొమ్మిది మంది మంత్రులతో కొలువు తీరిన విషయం తెలిసిందే.  టాయిలెట్లలో నీటి కొరతను అధికారులు పట్టించుకోక పోవటంతో మంత్రులు, షేపీ సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు.

సాధారణంగా అయితే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల లాంటి బహిరంగ ప్రదేశాలలో టాయిలెట్లలో నీళ్లు రాకపోవడం సర్వ సాధారణం. కానీ వీఐపీలు, వీవీఐపీలు ఉండే సచివాలయంలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే సర్కారు పాలనా తీరు ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. సామాన్యులకు సమస్య వస్తే ఏమాత్రం పట్టించుకోని సచివులు.. ఇప్పుడు తమ సమస్య విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
 

Advertisement
 
Advertisement
Advertisement