వాచ్‌మన్ దారుణహత్య | Sakshi
Sakshi News home page

వాచ్‌మన్ దారుణహత్య

Published Mon, Dec 16 2013 11:34 PM

Watch Men's brutal murder

హైదరాబాద్, న్యూస్‌లైన్ : శ్రీనగర్‌కాలనీలోని ఓ కళాశాలలో వాచ్‌మన్ దారుణహత్యకు గురయ్యాడు. గొంతుకోసి, తల పగులగొట్టి దుండగులు అతడిని అతికిరాతంగా చంపేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన మోతి రాజిరెడ్డి (55)  శ్రీనగర్‌కాలనీ లోని నారాయణ కాలేజీలో పది నెలలుగా వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. రాజిరెడ్డికి ముగ్గురు కొడుకులున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీనగర్‌కాలనీ ప్రధాన రహదారిలో నర్సింహారెడ్డి అనే వ్యక్తికి ఐదంతస్తుల భవనం ఉంది. ఇందులో నా లుగు అంతస్తులు నారాయణ కాలేజీకి అద్దె కు ఇవ్వగా... 5వ అంతస్తులో ఇంటి యజమాని ఉంటున్నాడు.

వాచ్‌మన్ రాజిరెడ్డి పగటిపూట సెల్లార్‌లోని ఓ గదిలో ఉంటూ.. రాత్రి కాలేజీ మొదటి అంతస్తులోని కార్యాలయంలో పడుకుంటాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి కళాశాల కార్యాలయంలో నిద్రపోయాడు. సో మవారం ఉదయం 7 గంటలకు స్వీపర్ రమాదేవి 2వ అంతస్తులోని క్లాస్‌రూంను ఊడ్చేందు కు వెళ్లగా రాజిరెడ్డి రక్తపు మడుగులో హత్యకు గురై ఉన్నాడు. భయాందోళనకు గురైన ఆమె వెంటనే కిందకు వచ్చి ఆఫీస్ బాయ్ అమర్‌కు చెప్పింది. అతడి ద్వారా విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ రవిశంకర్ పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీసీపీ సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ నాగరాజు, ఏసీపీ వెంకటనర్సయ్య, ఇన్‌స్పెక్టర్ తిరుపతిరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కళాశాల కార్యాలయంలోని రూ.48 వేలు, 2 కంప్యూటర్ సీపీయూలు, ప్రింటర్ మాయమైనట్టు గుర్తించారు. కాలేజీలోని నగదు, సీపీయూలు మాయం కావడం తో రాజిరెడ్డిని చంపి దొంగలు వాటిని తీసుకెళ్లారా ? లేక మరేదైనా కారణం ఉందా? మొద టి అంతస్తులో పడుకున్న రాజిరెడ్డి 2వ అంతస్తులోని క్లాస్ రూంలో ఎలా హత్యకు గురయ్యాడు అనే కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు.
భవన యజమాని కుమారుడు బాల్‌రెడ్డి నిత్యం మద్యం తాగివచ్చి వాచ్‌మన్ రాజిరెడ్డితో గొడవపడేవాడని తెలిసి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే కళాశాలలో వాచ్‌మచ్‌గా పని చేసి మానేసిన కృష్ణతో పాటు కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ భీముడు, ఆఫీస్‌బాయ్ అమర్‌ను కూడా విచారిస్తున్నారు. తెలిసిన వారే వాచ్‌మన్‌ను హత్య చేశారని, రెం డు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని  డీసీపీ సత్యనారాయణ తెలిపారు.  ఇద్దరు లేదా ముగ్గురు హత్యలో పాల్గొని ఉంటారని పోలీ సులు భావిస్తున్నారు.
 కుటుంబ సభ్యుల ఆందోళన :
 తన తండ్రి దారుణ హత్యకు గురైతే కళాశాల యాజమాన్యం వచ్చి కనీసం చూడలేదని, తమ కు న్యాయం చేసే వరకూ మృతదేహాన్ని తరలించడానికి వీలులేదని మృతుడి బంధువులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు వారిని పక్కకు నెట్టేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలిం చారు. బాధితులు ప్రధాన రహదారిపై ఆందోళన చేయగా స్వల్పంగా లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న తమ పై పోలీసులు దౌర్జన్యం చేయడం సరికాదని రాజిరెడ్డి కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement