ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్నారు | villagers stoped officers | Sakshi
Sakshi News home page

ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్నారు

May 13 2015 11:45 PM | Updated on Sep 3 2017 1:58 AM

దేవీపట్నం మండలంలోని అంగుళూరు గ్రామంలో పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్‌కు అడ్డంకిగా మారిన గిరిజనేతరులకు చెందిన ఇళ్లు కూల్చివేసేందుకు బుధవారం చేసిన ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.

తూర్పు గోదావరి(దేవీపట్నం): దేవీపట్నం మండలంలోని అంగుళూరు గ్రామంలో పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్‌కు అడ్డంకిగా మారిన గిరిజనేతరులకు చెందిన ఇళ్లు కూల్చివేసేందుకు బుధవారం చేసిన ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం ప్యాకేజి అందేవరకూ ఇళ్లు కూల్చివేయడానికి వీల్లేదన్నారు. ఇప్పటివరకు గ్రామస్తులందరికీ ప్యాకేజి మొత్తం అందించామని అధికారులు తెలిపారు. కాగా ఉదయం గ్రామానికి వచ్చిన ఆర్డీవో సత్యవాణి ఎట్టి పరిస్థితుల్లో గ్రామాన్ని ఖాళీ చేయించాలని తహశీల్దార్ ఎం.వి.వి.సత్యనారాయణ, ఎస్.ఐ. నున్న రాజులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement