'స్మార్ట్ సిటీస్ గా విజయవాడ, విశాఖ' | Vijayawada, Vizag to be developed as smart cities, says Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

'స్మార్ట్ సిటీస్ గా విజయవాడ, విశాఖ'

Sep 15 2014 2:38 PM | Updated on May 3 2018 3:17 PM

'స్మార్ట్ సిటీస్ గా విజయవాడ, విశాఖ' - Sakshi

'స్మార్ట్ సిటీస్ గా విజయవాడ, విశాఖ'

విశాఖపట్నం, విజయవాడలను స్మార్ట్ సిటీస్ గా అభివృద్ధి చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు.

విజయవాడ: విశాఖపట్నం, విజయవాడలను స్మార్ట్ సిటీస్ గా అభివృద్ధి చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రోరైలు సర్వీసు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

దేశంలో 100 స్మార్ట్ సిటీస్ అభివృద్ధి చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనిలో భాగంగా బెజవాడ, వైజాగ్ లను స్మార్ట్ నగరాలు తీర్చిదిద్దుతామని చెప్పారు. వీటిలో నిరంతర మంచినీరు, విద్యుత్ సరఫరా, రవాణా, వైద్యసదుపాయాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. స్మార్ట్ సిటీస్ పై విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్  నిర్వహించిన సదస్సులో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement