మీలాంటి జ్ఞాని అలా అనకపోతే ఆశ్చర్యం | Vijayasai Reddy Slams Chandrababu On Twitter | Sakshi
Sakshi News home page

మీలాంటి జ్ఞాని అలా అనకపోతే ఆశ్చర్యం

Sep 21 2019 9:49 AM | Updated on Sep 21 2019 10:00 AM

Vijayasai Reddy Slams Chandrababu On Twitter - Sakshi

విజయసాయిరెడ్డి

మీలాంటి జ్ఞాని అలా అనకపోతేనే ఆశ్చర్య..

సాక్షి, అమరావతి : గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్‌ అయ్యాయంటూ ఎల్లోమీడియా చేస్తున్న ప్రచారంపై  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. శనివారం ట్విటర్‌ వేదికగా ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘  పరీక్ష రాసిన అభ్యర్థులతో ఏదో ఒక ఫిర్యాదు చేయించాలని మీ అనుకూల మీడియా ఎగ్జామ్‌ సెంటర్ల చుట్టూ తిరిగింది. ఎవరూ తప్పుపట్టలేదు. చివరకు తమరే పూనుకుని ప్రశ్నాపత్రం లీక్ అయిందని గొల్లుమనడం ఊహించిందే కదా చంద్రబాబు గారూ. మీలాంటి జ్ఞాని అలా అనకపోతేనే ఆశ్చర్య పోవాలి’’ అంటూ ఎద్దేవా చేశారు.

కోడెల విషయంపై కూడా ఆయన స్పందిస్తూ ‘‘ ఎల్లో మీడియా సౌజన్యంతో కోడెల గారి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు చంద్రబాబు తన ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ను అద్భుతంగా ప్రదర్శించారు. అంతకు ముందు వర్ల వంటి వారిని ఆయనపైకి ఉసిగొల్పి అవమానించారు. పల్నాటి పులి అంటూనే తీవ్ర క్షోభకు గురిచేశారు’’ అంటూ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement