వ్యాను ఢీకొని వ్యక్తి మృతి | Van hit a man killed | Sakshi
Sakshi News home page

వ్యాను ఢీకొని వ్యక్తి మృతి

Dec 9 2015 7:15 PM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా దూసుకొచ్చిన వ్యాను నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న ఘటన బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది.

వేగంగా దూసుకొచ్చిన వ్యాను నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న ఘటన బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది. వివరాలు.. గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన వి.వెంకీ అనే యువకుడు పార్వతీపురంలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని బుధవారం సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరాడు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సిగ్నల్స్ వద్ద... కూరగాయలతో వెళుతున్న వ్యాన్ అతన్ని ఢీకొంది. తీవ్ర గాయాలతో వెంకి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.



 

Advertisement
 
Advertisement
Advertisement