అడ్డగోలు విభజన అప్రజాస్వామికం | united agitation become severe in nellore district | Sakshi
Sakshi News home page

అడ్డగోలు విభజన అప్రజాస్వామికం

Feb 24 2014 3:04 AM | Updated on Oct 22 2018 9:16 PM

సీమాంధ్రుల అభిప్రాయాలు, మనోభావాలతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అప్రజాస్వామిక చర్యలకు సోనియాగాంధీ నేతృత్వంలో యూపీఏ సర్కారు పాల్పడిందని జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. నాగిరెడ్డి అన్నారు.

నెల్లూరు సిటీ,న్యూస్‌లైన్:  సీమాంధ్రుల అభిప్రాయాలు, మనోభావాలతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అప్రజాస్వామిక చర్యలకు  సోనియాగాంధీ నేతృత్వంలో యూపీఏ సర్కారు పాల్పడిందని జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. నాగిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఆదివారం స్థానిక వీఆర్‌సీ కూడలి నుంచి గాంధీ బొమ్మ కూడలి వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం యూపీఏ  అనుసరిస్తున్న తీరు బ్రిటిష్ పాలనను తలపిస్తోందన్నారు.
 
 గత పాలకులు హైదరాబాద్‌తో పాటు మిగతా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ఉంటే విభజన జరిగి ఉండేది కాదన్నారు. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన తెలుగు జాతిని విభజించి చారిత్రక తప్పదానికి  పాల్పడ్డారన్నారు. తెలంగాణ నాయకులు చిత్తశుద్ధి ఉంటే పదువులను ఆశించకుండా తెలంగాణ కోసం ఆసువులు బాసిన అమరుల కుటుంబ సభ్యులకు  శాసన సభ, పార్లమెంటు స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సురేంద్ర, మల్లికార్జున పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement