ఇంట్లో పార్క్ చేసి ఉన్న ఓ ప్రజాప్రతినిధి కారు కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు.
డెంకాడ ఎంపీపీ కారు దహనం
Jan 4 2016 12:59 PM | Updated on Sep 3 2017 3:05 PM
డెంకాడ: ఇంట్లో పార్క్ చేసి ఉన్న ఓ ప్రజాప్రతినిధి కారు కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కివరం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఇంటి మందు పార్క్ చేసి ఉన్న కారును దుండగులు తగలబెట్టారు. ఇది గుర్తించిన స్థానికులు ఎంపీపీని అప్రమత్తం చేసేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. దీంతో చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


