ఇద్దరి దారుణహత్య | two people brutal murder in Devarapalle Village i | Sakshi
Sakshi News home page

ఇద్దరి దారుణహత్య

May 16 2015 1:59 AM | Updated on Aug 25 2018 5:33 PM

మండలంలోని పట్టెంవాండ్లపల్లి పంచాయతికి కూతవేటు దూరంలో వున్న కర్ణాటక రాష్ట్రం ఊదవారిపల్లి సమీప పొలాల్లో

కొడవళ్లతో గొంతు కోసి హత్య
 మృతుడు అనంత    జిల్లా వాసి..
 మరో మహిళ కర్ణాటక వాసి
 సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలో సంచలనం

 
 పెద్దతిప్పసముద్రం: మండలంలోని పట్టెంవాండ్లపల్లి పంచాయతికి  కూతవేటు దూరంలో వున్న కర్ణాటక రాష్ట్రం ఊదవారిపల్లి సమీప పొలాల్లో శుక్రవారం వేకువ జామున  వెంకటేష్ (42) అనే ఓ వ్యక్తి, సుకన్య (32) అనే మరో మహిళ గుర్తు తె లియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. దుం డగులు ఇద్దరిని కొడవళ్లతో ముఖం నరికి, గొంతులు కోసి వి చక్షణా రహితంగా నరికి పరారయ్యారు. మృతుల్లోని ఓ వ్యక్తి అనంత జిల్లా వాసి కాగా మరో మహిళ కర్ణాటక రాష్ట్రం ఊదవారిపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు.  సరిహద్దుకు సమీపంలో జరిగిన జంట హత్యలు ఇటు మండలంలోనూ, అటు కర్ణాటక రాష్ట్రంలోనూ తీవ్ర సంచలనం రేపాయి.
 
 కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపురం జిల్లా బాగేపల్లి తాలూకా చేలూరు సమీపంలోని పులగల్ పంచాయతి ఊదవారిపల్లికి చెందిన నాగ ప్ప కుమార్తె సుకన్యకు చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రంకు చెందిన రామచంద్ర అనే వ్యక్తితో పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో గొడవపడిన సుకన్య తెగతెంపులు చేసుకుని  ఏడేళ్ల క్రితం పుట్టింటికి చేరి ఊదవారిపల్లిలోని తల్లిదండ్రుల వద్దే వుండేది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా తనకల్లు మండలం ఎరబల్లికి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు నాలుగేళ్ల క్రితం ఊదవారిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. ఇదే గ్రామంలోని ఓ రైతుకు చెందిన బోరు, భూములను కౌలుకు తీసుకుని వెంకటేష్ వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవాడు.
 
 ఈ తరుణంలో టమోటా పంటకు నీళ్లు కట్టాలని గురువారం రాత్రి పొలం వద్దకు వచ్చి ఇలా విగత జీవిగా మారిందని సుకన్య కన్నవాళ్లు, రాత్రి వేళ జింకల బెడద కారణంగా పంటకు కాపలాగా రాత్రి పొలం వద్దకు వెళ్లిన వ్యక్తి తెల్లారేసరికి దారుణ హత్యకు గురయ్యాడని వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యలకు దారి తీసిందా, వేరే ఇతర కారణాలా? అనేది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి వుంది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకోసం బాగేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement