బైక్లను ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి | two killed in road accident in krishna district | Sakshi
Sakshi News home page

బైక్లను ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

Jul 12 2016 6:20 PM | Updated on Aug 30 2018 4:07 PM

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కోమటిగుంట వద్ద మంగళవారం కారు బీభత్సం సృష్టించింది. కారు... ఎదురుగా వస్తున్న రెండు బైకులను ఢీకొట్టింది.

విజయవాడ : కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కోమటిగుంట వద్ద మంగళవారం కారు బీభత్సం సృష్టించింది. కారు... ఎదురుగా వస్తున్న రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement