వ్యాన్, బైక్ ఢీ : ఇద్దరికి గాయాలు | Two injured in road accident | Sakshi
Sakshi News home page

వ్యాన్, బైక్ ఢీ : ఇద్దరికి గాయాలు

Aug 16 2015 11:52 AM | Updated on Aug 30 2018 3:56 PM

మినీ వ్యాన్, బైక్ ఒకదానిని మరొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

కంకిపాడు (విజయవాడ) : మినీ వ్యాన్, బైక్ ఒకదానిని మరొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

మండల కేంద్రంలోని గోసాల సెంటర్‌లో మినీ వ్యాన్, ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం వీరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement