చిత్తూరు జిల్లాలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ | two children kidnapped in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్

Oct 25 2014 9:44 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లాలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ - Sakshi

చిత్తూరు జిల్లాలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్

త్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్కు గురయ్యారు. దాంతో పిల్లల

చిత్తూరు : చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్కు గురయ్యారు.  దాంతో పిల్లల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పిల్లల అదృశ్యంపై వారి దూరపు బంధువుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే చల్లావారిపల్లెకు చెందిన గణేష్, రెడ్డెప్ప పిల్లలు రాయలపేటలోని వారి నానమ్మ సంరక్షణలో ఉంటున్నారు.

గురువారం దీపావళి సందర్భంగా వారు స్వగ్రామానికి వచ్చారు. ఆ రోజు సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న గణేష్ కుమార్తె లావణ్య (7), రెడ్డెప్ప కుమార్తె సంగీత (7) కనపడకపోవటంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. అయితే వారిద్దరూ ఓ మహిళతో మాట్లాడుతూ వెళ్లటం చూశామని స్థానికులు తెలిపారు. దాంతో మదద్లకుంఠకు చెందిన జానకమ్మపై అనుమానాలున్నాయని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement