నీటికుంటలో పడి ఇద్దరు బాలికల మృతి | Two children drown in pond | Sakshi
Sakshi News home page

నీటికుంటలో పడి ఇద్దరు బాలికల మృతి

Jan 23 2016 4:43 PM | Updated on Apr 4 2019 4:44 PM

మంచి నీళ్లు తాగేందుకు కుంట దగ్గరకు వెళ్లిన ఇద్దరు బాలికలు కుంటలో పడి మృతిచెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

దేవనకొండ (కర్నూలు) : మంచి నీళ్లు తాగేందుకు కుంట దగ్గరకు వెళ్లిన ఇద్దరు బాలికలు కుంటలో పడి మృతిచెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేశ్వరి(7), సుఖి(6) అనే ఇద్దరు చిన్నారులు పొలంలో బావి వద్ద పని చేసుకుంటున్న తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడ సమీపంలో ఉన్న కుంటలో మంచినీళ్లు తాగడానికి లోపలికి దిగారు. ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇది గుర్తించిన వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement