అందుబాటులో టీటీడీ కేలండర్లు, డైరీలు | TTD New Year Calendars, Diaries available | Sakshi
Sakshi News home page

అందుబాటులో టీటీడీ కేలండర్లు, డైరీలు

Nov 21 2015 8:32 PM | Updated on Sep 3 2017 12:49 PM

నూతన సంవత్సరానికి సంబంధించిన టీటీడీ కేలండర్లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచారు.

తిరుమల : నూతన సంవత్సరానికి సంబంధించిన టీటీడీ కేలండర్లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచారు. 12 షీట్ల కేలండర్ రూ.75, శ్రీవేంకటేశ్వర స్వామివారి పెద్ద కేలండర్ రూ.10, పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి చిన్న కేలండర్ రూ.7, డైరీ రూ.100 ప్రకారం విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ శ్రీ బాలాజీ భవన్‌లోని టీటీడీ పుస్తక విక్రయశాలలో అందుబాటులో ఉంచారు.

అలాగే తిరుమల ఆలయం ఎదురుగా, లేపాక్షి ఎదుట, నిత్యాన్నప్రసాద భవన కేంద్రం, ఏటీసీ వద్ద కూడా విక్రయిస్తున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, రైల్వే స్టేషన్, గోవిందరాజస్వామి ఆలయం పక్కన ధ్యానమందిరం, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీలోని టీటీడీ సమాచార కేంద్రాలు, కల్యాణ మండపాల వద్ద అందుబాటులో ఉంచారు. వివరాలకు ఫోన్ (040-23220852,23220457) ద్వారా సంప్రదించాలని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి తలారి రవి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement