'సీమాంధ్ర ఉద్యమాన్ని సీఎం, డీజీపీలు నడుపుతున్నారు' | TRS MLA Harish rao fire on CM Kiran Kumar Reddy, DGP Dinesh Reddy | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర ఉద్యమాన్ని సీఎం, డీజీపీలు నడుపుతున్నారు'

Sep 4 2013 1:17 PM | Updated on Sep 1 2017 10:26 PM

సీఎం కిరణ్, డీజీపీ దినేష్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హారిశ్రావు బుధవారం మెదక్ లో నిప్పులు చెరిగారు.

సీఎం కిరణ్, డీజీపీ దినేష్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు బుధవారం మెదక్ లో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7వ తేదీన ఏపీఎన్జీవోలు చేపట్టనున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.

 

అదే రోజు తెలంగాణ ఉద్యోగులు చేపట్టనున్న శాంతి ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన కిరణ్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ సర్కార్ సీమాంధ్రవారిని ఓ విధంగా, తెలంగాణ ప్రాంతం వారిని మరో విధంగా చూస్తుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఉద్యమాన్ని సీఎం,డీజీపీలు దగ్గర ఉండి నడపుతున్నారని ఆయన ఆరోపించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement