కొనసాగుతున్న ఆదివాసీల బంద్‌

Tribals Protest Against Supreme Court Repeal Of GO Three - Sakshi

సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల బంద్‌ కొనసాగుతోంది. షెడ్యూల్‌ ప్రాంతంలోని ఉపాధ్యాయ ఉద్యోగాలు శాతం స్థానిక గిరిజనులకే చెందేలా గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-3ని సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని నిరసిస్తూ అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో- 3 సాధన సమితి, గిరిజన సంఘాలు మంగళవారం బంద్‌కు పిలుపునివ్వడంతో విశాఖ మన్యంలో 11 మండలాల్లో దుకాణాలు మూసివేశారు. వాహనాలను నిలిపివేయడంతో బాటు సంతలను కూడా బంద్‌ చేశారు. మన్యం బంద్ కు  మావోయిస్టులు మద్దతు తెలిపారు. సీతంపేట ఏజెన్సీలో బంద్‌ కారణంగా షాపులు మూసివేశారు. జీవో-3 రద్దును నిరసిస్తూ గిరిజనులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి.

ఆదిలాబాద్ జిల్లా ‌: జీవో నంబర్‌ 3పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రాష్ట్ర ఆదివాసీ తుడుం దెబ్బ నాయకులు ఇచ్చిన  పిలుపు మేరకు ఉట్నూర్, ఇంద్రవేల్లి, నార్నూర్, గాదిగూడ, జైనూర్. సిర్పూర్  ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌ కొనసాగుతుంది. ఉట్నూర్‌లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top