ఏపీ సచివాలయంలో బదిలీల సందడి | transfers fever prevails in andhra pradesh secretariat | Sakshi
Sakshi News home page

ఏపీ సచివాలయంలో బదిలీల సందడి

Nov 12 2014 2:00 PM | Updated on Aug 18 2018 4:13 PM

ఆంధ్రప్రదేశ్ సచివాయంలో బదిలీల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రుల పేషీలు కిటకిటలాడుతున్నాయి.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాయంలో బదిలీల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రుల పేషీలు కిటకిటలాడుతున్నాయి. అన్ని శాఖల మంత్రులు బదిలీల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు సచివాలయంలోనే తిష్టవేసి... తమకు అనుకూలమైనవారికి సిఫార్సులు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లోనూ ఉద్యోగులు, అధికారులను...బదిలీ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల సిఫార్సుల లేఖలకే తొలి ప్రాధాన్యం ఇవ్వటం విశేషం. ఈ నెల 15వ తేదీతో బదిలీల గడువు ముగియనుంది. మరోవైపు జియోట్యాగ్ విధానం  కారణంగా గృహనిర్మాణశాఖలో బదిలీలను మంత్రి మృణాళిని నిలిపివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement