నేడు సీఎం చంద్రబాబు రాక | Today, the arrival of the chief Chandrababu | Sakshi
Sakshi News home page

నేడు సీఎం చంద్రబాబు రాక

Nov 20 2014 1:46 AM | Updated on Aug 13 2018 3:58 PM

నేడు సీఎం చంద్రబాబు రాక - Sakshi

నేడు సీఎం చంద్రబాబు రాక

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడకు రానున్నారు.

విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడకు రానున్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన విచ్చేస్తున్నారు. ఉదయం 9.15 గంటలకు హైదరాబాదులోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10.30కి విజయవాడ బందర్ రోడ్డులోని ఎ-కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని, అక్కడ జరిగే టీడీపీ సమావేశంలో పాల్గొంటారు.

సాయంత్రం 6.30కి విజయవాడ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడినుంచి హైదరాబాద్ వెళతారు. పార్టీ సమావేశానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రులు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బి.గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, కొల్లు రవీంద్ర తదితరులు హాజరుకానున్నారు. సీఎం రాకను పురస్కరించుకొని కమిషనరేట్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement