ఈనాటి ముఖ్యాంశాలు

Today Telugu News Mar 3rd Modi held Video Conference with Media Groups - Sakshi

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇక, విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు 14 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. మరోవైపు, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రజలు సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం,  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. కరోనాపై చేస్తున్న యుద్ధంలో మీడియా ప్రతినిధులు, కెమెరా పర్సన్స్‌, సాంకేతిక నిపుణులు దేశానికి గొప్ప సేవ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇకపోతే, కరోనా దెబ్బకు నేడు స్టాక్‌మార్కెట్లు మరో బ్లాక్‌ మండేను చూడాల్సి వచ్చింది. సోమవారం చోటు చేసుకున్న మరిన్నివార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top