ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Jan 12th 2020 Janasena Activists on Dwarampudi House In Kakinada | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Jan 12 2020 8:02 PM | Updated on Jan 12 2020 8:02 PM

Today Telugu News Jan 12th 2020 Janasena Activists on Dwarampudi House In Kakinada - Sakshi

తాను పవన్‌పై చేసిన వ్యాఖ్యలకు  జనసేనకు చెందిన కొందరు నేతలు పని గట్టుకొని కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం  ద్వారంపూడి  చంద్రశేఖర్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన కార్యకర్తలు ద్వారంపూడి ఇంటిపై రాళ్లదాడి చేయటంతో పరిస్థితులు అదుపు తప్పింది. సంక్షేమ పథకాలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుందన్న అక్కసుతోనే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణలు రాజధానిపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  ఆదివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement