
ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు గుండాగిరీకి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో రామకృష్ణారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనను ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిరికపంద చర్యగా అభివర్ణించారు. పాకిస్తాన్ చెర నుంచి విడిపించిన ఏపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆంధ్రా జాలర్లు తెలిపారు. తమ విడుదలకు చొరవ చూపిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనపై ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు శిక్ష అమలు తేదీని ఖరారు చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలలోపు ఉరిశిక్ష అమలు చేయాలని పటియాల హౌస్‌కోర్టు ఆదేశించింది. వరంగల్‌లో మడికొండలోని ఐటీ పార్క్‌లో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్‌లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంగళవారం నాడు చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.