ఈనాటి ముఖ్యాంశాలు | Today News Roundup December 25th Christmas Celebrations | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Dec 25 2019 6:56 PM | Updated on Feb 18 2020 2:44 PM

Today News Roundup December 25th Christmas Celebrations - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచేందుకు కేంద్రం కొత్త ప‌థ‌కాన్ని మొద‌లుపెట్టింది. మాజీ ప్రధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీద అట‌ల్ భూజ‌ల్ ప‌థ‌కాన్ని ఇవాళ ప్రధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బుధవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement