నేటి ప్రధాన వార్తలు | Today News Rounduo 4th April 2018 | Sakshi
Sakshi News home page

నేటి ప్రధాన వార్తలు

Apr 4 2018 5:53 PM | Updated on Apr 4 2018 5:53 PM

 Today News Rounduo 4th April 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బుధవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా సాధనసమితి నేతలు చలసాని శ్రీనివాసరావు, తాడి నరేష్‌, కొండా నర్సింగరావు, సదాశివరెడ్డి, అప్పలనాయుడు, మల్లికార్జున్‌, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌తో ప్రత్యేక హోదా సాధన సమితి నేతల భేటీ
ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బుధవారం భేటీ అయ్యారు.

ప్రగతి భవన్‌ గడీ పగలగొడతాం: కోదండరాం
ప్రజాస్వామిక స్పూర్తికి విరుద్ధంగా కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ధ్వజమెత్తారు.

ఎక్కడ యూటర్న్‌ చూసినా ఆయనే గుర్తొస్తారు!
‘రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడ యూటర్న్‌ కనిపించినా.. చంద్రబాబే గుర్తొస్తున్నారు. యూటర్న్‌ తీసుకోవాల్సి వచ్చినా.. ఇది చంద్రబాబు రహదారి, మనకెందుకులే అని ముందుకు వెళ్లాలని అనిపిస్తోంది.

ఫిలిప్పీన్స్‌లో భారత విద్యార్థులపై దాడి
ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్‌ విద్యనభ్యసిస్తన్న భారతీయ విద్యార్థులపై తాగిన మత్తులో ముగ్గురు స్థానికులు దాడికి పాల్పడ్డారు.

తప్పుగా మాట్లాడితే దండించలేను : ఉప రాష్ట్రపతి
ప్రతి రాజ్యసభ సభ్యుడు హిందీ భాషలో తప్పనిసరిగా మాట్లాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

టీడీపీ-బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం
ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ఏపీ పెట్టుబడుల విషయంపై టీడీపీ-బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

పిచాయ్‌ దిగ్భ్రాంతి.. సత్య నాదెళ్ల విచారం!
ప్రముఖ వీడియో షేరింగ్‌ కంపెనీ యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ మంగళవారం ఉదయం కాల్పులు జరపడం కలకలం రేపింది.

బాహుబలితో ‘రంగస్థల’ బ్రహ్మ..!
రామ్‌ చరణ్‌ హీరోగా రంగస్థలం చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్‌ తన తదుపరి చిత్రా‍న్ని ఓ స్టార్‌ హీరోతో చేయనున్నట్టుగా తెలిపారు.

భర్త గురించి సానియా ట్వీట్.. వైరల్
తన భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చికెన్‌లా ఉంటాడని భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లైక్స్, షేర్లు చేయడంతో వైరల్‌గా మారింది.

షాకింగ్‌: లక్షల కోట్ల రూపాయల రుణాలు రద్దు
ప్రభుత్వరంగ బ్యాంకులకు వేలకోట్ల  రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు చెక్కేస్తున్న బడాబాబుల బండారం సామాన్య ప్రజానీకం గుండెల్లో  ఆగ్రహాన్ని రగిలిస్తోంటే..

Advertisement
 
Advertisement
Advertisement