భర్త గురించి సానియా ట్వీట్.. వైరల్

Sania Mirza Tweet On Husband Shoaib Malik Goes Viral - Sakshi

తన భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చికెన్‌లా ఉంటాడని భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లైక్స్, షేర్లు చేయడంతో వైరల్‌గా మారింది. డానియెల్ అలెగ్జాండర్ అనే నెటిజన్.. షోయబ్ మాలిక్, షహీన్ షా అఫ్రిది అఫ్రిది ఇద్దరూ పాక్ జట్టుకు ఆడుతున్నారు. అఫ్రిది ఏప్రిల్ 6, 2000 సంవత్సరంలో పుట్టాడు. మాలిక్ అక్టోబర్ 14, 1999లో క్రికెటర్ అరంగ్రేటం చేశాడని డానియెల్ ట్వీట్ చేశాడు.  కాగా మాలిక్ ఫిబ్రవరి 1, 1982లో జన్మించిన విషయం తెలిసిందే.

అయితే నెటిజన్ డానియెల్ ట్వీట్‌పై టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా స్పందించారు. 'కామన్.. నా భర్త ఇప్పటికీ స్ప్రింగ్ చికెన్‌లా ఉంటాడంటూ' డానియెల్ ట్వీట్‌కు సానియా బదులిచ్చారు. సానియా ట్వీట్‌కు అనూహ్య స్పందన వస్తోంది. వయసు సంఖ్య మాత్రమేనని, ఫిట్‌నెస్ కాపాడుకుంటూ మాలిక్ ఇంకా జట్టులో కొనసాగుతున్నాడని కషీఫ్ బేగ్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. 'పాక్ క్రికెట్ జట్టులో ఉన్న ఎంతోమంది ఆటగాళ్ల కంటే కూడా మాలిక్ భాయ్ చాలా యంగ్‌గా కనిపిస్తాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. అన్న, వదిలనలను ఎంతగానో ప్రేమిస్తాను. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటూ' అలీ అనే అభిమాని ట్వీట్ చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top