ఈనాటి ముఖ్యాంశాలు | Today News Round up 2nd Feb 2020 Ajeya Kallam Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Feb 2 2020 7:29 PM | Updated on Feb 2 2020 7:32 PM

Today News Round up 2nd Feb 2020 Ajeya Kallam Slams Chandrababu Naidu - Sakshi

తెలంగాణ ఉద్యమం తొలితరం నాయకుడు, నిజామాబాద్ మాజీ ఎంపీ ఎం.నారాయణరెడ్డి కన్నుమూశారు. గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉండగా అమ్మ ఒడి పథకం ద్వారా 44 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు.తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. మరోవైపు ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆదివారం పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన  అనంతరం  ఆర్‌అండ్‌ ఆర్‌, పోలవరం ప్రాజెక్ట్‌ అధికారులతో  అనిల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక భారత్‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే చైనీయులకు, చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఆన్‌లైన్‌ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఇండియా ప్రకటించింది. ఆదివారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement