నేడు సీఎం చంద్రబాబు రాక | Today Cm Chandrababu Jnanabheri in Prakasam | Sakshi
Sakshi News home page

నేడు సీఎం చంద్రబాబు రాక

Dec 12 2018 1:22 PM | Updated on Dec 12 2018 1:22 PM

Today Cm Chandrababu Jnanabheri in Prakasam - Sakshi

రాజుపాలెం వద్ద హెలీప్యాడ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ

ఒంగోలు అర్బన్‌: జిల్లా కేంద్రం ఒంగోలులో బుధవారం జరిగే జ్ఞానభేరి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారయింది. ఉదయం 9.45 గంటలకు ఇంటి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.05 గంటలకు మార్టూరు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11 గంటలకు ఒంగోలు దక్షిణ బైపాస్‌లో ఏర్పాటు చేసిన జ్ఞానభేరి వేదిక వద్దకు చేరుకుంటారు. అనంతరం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. మార్టూరు వరకు రోడ్డు మార్గం ద్వారా అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నివాసానికి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయత్రం 5 గంటల సమయంలో జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్, ఎస్సీ సత్యఏసుబాబు, ఇతర జిల్లా అధికారులతో కలిసి మార్టూరు మండలం రాజుపాలెం సమీపంలోని హెలీప్యాడ్‌ను పరిశీలించారు. భద్రత పరమైన చర్యల గురించి అధికారులతో చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement