నేడు సంగారెడ్డిలో టీజేఏసీ భారీ ర్యాలీ | TJAC mobilising people for 'Sakala Jana Bheri' | Sakshi
Sakshi News home page

నేడు సంగారెడ్డిలో టీజేఏసీ భారీ ర్యాలీ

Sep 24 2013 1:27 AM | Updated on Sep 1 2017 10:59 PM

హైదరాబాద్ నిజాం కళాశాలలో ఈ నెల 29న నిర్వహించనున్న సకలజనుల భేరి విజయవంతానికి జిల్లా టీజేఏసీ, ఉద్యోగ సంఘాలు, టీఆర్‌ఎస్ జిల్లాలో సన్నాహక కార్యక్రమాలపై దృష్టి సారించాయి.

 సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నిజాం కళాశాలలో ఈ నెల 29న నిర్వహించనున్న సకలజనుల భేరి విజయవంతానికి జిల్లా టీజేఏసీ, ఉద్యోగ సంఘాలు, టీఆర్‌ఎస్ జిల్లాలో సన్నాహక కార్యక్రమాలపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా టీ జేఏసీ మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో భారీ ర్యాలీ, సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సన్నాహక సమావేశానికి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు. టీ జేఏసీ చైర్మన్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే మరో బృందం పాత బస్టాండు నుంచి జడ్పీ వరకు ర్యాలీ నిర్వహిస్తుంది.
 
 అనంతరం జడ్పీ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు.  మరోవైపు ఉద్యోగసంఘాలు సైతం సకలజనుల భేరి విజయవంతంపై దృష్టి పెట్టాయి. ఈనెల 25వ తేదీన టీఎన్జీవో ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలతో కలిపి సంగారెడ్డి, జహీరాబాద్‌లో ర్యాలీ, సభలు నిర్వహించనుంది. ఈ సభలకు టీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు దేవీప్రసాద్ హాజరుకానున్నారు. కాగా టీఆర్‌ఎస్ పార్టీ సైతం 29వ తేదీన నిర్వహించనున్న సకలజనుల భేరికి భారీగా జనాన్ని తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లా నుంచి 12వేల మందిని  భేరికి తరలించేందకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement