తిరుపతి టీడీపీ అభ్యర్ధిగా సుగుణ! | Tirupati TDP candidate virtues! | Sakshi
Sakshi News home page

తిరుపతి టీడీపీ అభ్యర్ధిగా సుగుణ!

Dec 19 2014 5:58 AM | Updated on Aug 10 2018 8:13 PM

తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున మన్నేరి సుగుణను బరిలోకి దించనున్నారు.

  • టీడీఎల్పీ భేటీలో ప్రస్తావించిన చంద్రబాబు
  • సాక్షి, హైదరాబాద్: తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున మన్నేరి సుగుణను బరిలోకి దించనున్నారు. ఇటీవల మరణించిన తిరుపతి ఎమ్మెల్యే మన్నేరి వెంకట రమణ సేవలను గురువారం టీడీపీ శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.

    ఇద్దరు కుమార్తెలు బధిరులైనా వెంకట రమణ సతీమణి సుగుణ మనోధైర్యంతో నడుచుకుంటున్నారని చెప్పారు. సుగుణ ఉన్నత విద్యావంతురాలని (ఎంఏ ఇంగ్లీషు), వెంకట రమణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే శక్తిని భగవంతుడు ఆమెకు ప్రసాదించాలని కోరుకుందామన్నారు.

    ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాటలను బట్టి సుగుణను తిరుపతి టీడీపీ అభ్యర్ధిగా నిలబెడతారని భావిస్తున్నట్లు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు.
     

Advertisement
 
Advertisement
Advertisement