స్తంభాన్నిఢీ కొన్న బైక్... ముగ్గురు మృతి | three died in a bike accident | Sakshi
Sakshi News home page

స్తంభాన్నిఢీ కొన్న బైక్... ముగ్గురు మృతి

Feb 21 2015 9:38 PM | Updated on Sep 2 2017 9:41 PM

వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీ కొట్టింది.

నెల్లూరు: వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరు కోమాలో ఉన్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఆల్లూరు మండల పరిధిలో శనివారం జరిగింది. వివరాలు.. ఒక బైక్‌పై ఇద్దరు మహిళలు, ఒక బాలిక, ఒక పురుషుడు  నెల్లూరు నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపై ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న నందిని(10) అనే బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు ప్రమాదాన్ని గమనించి వారిని ఆటోలో తిమ్మాపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు(తల్లికూతురులు పేర్లు తెలియరాలేదు) మృతి చెందారు. కాగా, బైక్ నడుపుతున్న వ్యక్తి కోమాలో ఉన్నారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

(ఆల్లూరు)

Advertisement
 
Advertisement
Advertisement