దొంగ దొరికాడు | theaf taken in to custody | Sakshi
Sakshi News home page

దొంగ దొరికాడు

Jan 27 2015 7:09 PM | Updated on Sep 2 2017 8:21 PM

నాలుగు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దొంగ తనాలకు పాల్పడిన నిందితుడిని ఎట్టకేలకు మామిడి కుదురులో పోలీసులు పట్టుకున్నారు

పశ్చిమగోదావరి: నాలుగు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దొంగ తనాలకు పాల్పడిన నిందితుడిని ఎట్టకేలకు మామిడి కుదురులో పోలీసులు పట్టుకున్నారు. రాజోలు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన గుడిసే విజయబాబు(35) బాగా చేయితీరిగిన దొంగ.

దీంతో పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం విజయబాబును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5.28 లక్షల విలువైన బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాలు, డెల్ ట్యాబ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement