పాముకాటుతో యువరైతు మృతి | The young farmer died of snakebite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో యువరైతు మృతి

Dec 5 2015 10:53 AM | Updated on Oct 22 2018 2:22 PM

వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్లిన వ్యక్తికి పాముకాటుకు బలయ్యాడు.

వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్లిన వ్యక్తికి పాముకాటుకు బలయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏల్చూరు గ్రామానికి చెందిన పెద్దిరాజు(28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో శనివారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. బావి వద్ద ఏదో కుట్టినట్లు అనిపించి.. ఇంటికి వచ్చేశాడు. ఇంతలోనే నొటి నుంచి నురగలు రావడంతో పాటు.. మృతి చెందాడు. పాము కాటుతోనే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement