కిడ్నాప్ అయిన పురిటిబిడ్డ క్షేమం | The safety of newborns who was kidnapped | Sakshi
Sakshi News home page

కిడ్నాప్ అయిన పురిటిబిడ్డ క్షేమం

Jan 24 2015 6:30 PM | Updated on Sep 2 2017 8:12 PM

చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ మెటర్నిటీ ఆసుపత్రిలో ఈ నెల 20న మాయమైన పురిటిబిడ్డ పీలేరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యక్షమైంది.

తిరుపతి (చిత్తూరు): చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ మెటర్నిటీ ఆసుపత్రిలో ఈ నెల 20న మాయమైన పురిటిబిడ్డ పీలేరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యక్షమైంది. చంద్రగిరి మండలం మరవపల్లికి చెందిన మునిరాజు భార్య సోనియా డెలివరీ కోసం తిరుపతి ఆసుపత్రిలో చేరింది. బిడ్డ ప్రసవించిన కొద్దిసేపటి తర్వాత నర్సు వేషంలో వచ్చిన ఒకామె పురిటిబిడ్డను ఎత్తుకు పోయింది.

 

ఈ విషయం గురించి బిడ్డ తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు బురఖా వేసుకొచ్చిన ఒకామె బిడ్డను పీలేరు ప్రభుత్వాసుపత్రిలో విడిచి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. బిడ్డ దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారని పీలేరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సహదేవయ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement