పోలీసులు బుధవారం జడ్చర్ల శివారులోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం (డీటీసీ)లో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. బుధవారం జడ్చర్ల శివారులోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం (డీటీసీ)లో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు.
జడ్చర్ల, న్యూస్‌లైన్ : పోలీసులు బుధవారం జడ్చర్ల శివారులోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం (డీటీసీ)లో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీటీసీలో ఇటీవల శిక్షణను పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు సర్వీసులో చేరే ముందు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. పోలీసు శాఖలో విధుల్లో చేరిన వెంటనే కొత్త రక్తంతో నీతి, నిజాయితీలకు పెద్ద పీట వేస్తూ ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలన్నారు.
త్యాగానికి నిదర్శనమైన బక్రీద్ పర్వదినం రోజున రక్తదానం చేసి తాము త్యాగాలకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను ప్రజల్లోకి పంపడం గర్వంగా ఉందన్నారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవలందిస్తూ పోలీసుశాఖ ఖ్యాతిని పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రదీప్‌రెడ్డి, రెడ్‌క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ నటరాజ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు రవిశంకర్, డీటీసీ ఆర్‌ఐ యోగేశ్వర్‌రావు, స్థానిక సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.