ఇద్దరు కుమారులు సహా తల్లి ఆత్మహత్య | the mother and two sons committed suicide | Sakshi
Sakshi News home page

ఇద్దరు కుమారులు సహా తల్లి ఆత్మహత్య

Dec 31 2015 11:16 AM | Updated on Nov 6 2018 7:56 PM

జీవితం విరక్తి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులు సహా బావిలో దూకి తనువు చాలించింది.

జీవితం విరక్తి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులు సహా బావిలో దూకి తనువు చాలించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలం నాగులపాడు గ్రామంలో జరిగింది. గ్రామ హరిజనవాడకు చెందిన కట్కం ప్రమీల(28), బుధవారం రాత్రి కుమారులు శేఖర్(11), సుశీల్‌కుమార్(8)తో సహా వెళ్లి సమీపంలోని బావిలో దూకేసింది. బావిలో తేలియాడుతున్న శవాలను గురువారం ఉదయం స్థానికులు గుర్తించారు. మతిస్థిమితం లేకనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



 

Advertisement
 
Advertisement
Advertisement