నంద్యాల జిల్లా బిల్లలాపురం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మధుశేఖర్
విధుల్లో ఉండగా సచివాలయ భవనం పైఅంతస్తుకు వెళ్లి కత్తితో మణికట్టు, గొంతు కోసుకున్న వైనం
అధిక పని ఒత్తిడి, ఆపై ఆర్థిక ఇబ్బందులే కారణం
నంద్యాల(అర్బన్): గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయ భవనం పైఅంతస్తుకు వెళ్లి కత్తితో ఎడమ చేయి మణికట్టు, గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన నంద్యాల మండలం బిల్లలాపురం సచివాలయ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కురువ పిడుగు చిన్ననాగన్న, మల్లమ్మ కుమారుడు మధుశేఖర్ నెహ్రూనగర్ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పని చేస్తూ ఆర్నెల్ల కిందట నుంచి నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయానికి బదిలీపై వచ్చాడు.
బుధవారం విధుల్లో ఉన్న మధుశేఖర్ భోజనం సమయంలో బాత్‌రూంకు వెళ్లి వస్తానంటూ తోటి సిబ్బందితో చెప్పి సచివాలయ భవనం పైఅంతస్తుకు వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో ఉద్యోగులు వెళ్లి చూడగా మధుశేఖర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చాకుతో చేతి మణికట్టు, గొంతు కోసుకోవడంతో రక్తసిక్తమైంది. వెంటనే వారు 108కు ఫోన్ చేసి, అనంతరం ఎంపీడీఓకు సమాచారం అందించారు.
చికిత్స నిమిత్తం మధుశేఖర్‌ను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి్పంచారు. ఆత్మహత్యాయత్నానికి పని ఒత్తిడితో పాటు ఆరి్థక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ ఈశ్వరయ్య తెలిపారు.


