ఎండిన పంట చూసి రైతు ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

ఎండిన పంట చూసి రైతు ఆత్మహత్య

Nov 15 2015 6:17 PM | Updated on Oct 1 2018 2:36 PM

పత్తిపంట ఎండి పోవడంతో ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు.

పత్తిపంట ఎండి పోవడంతో ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉప్పరహాల్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. లక్ష్మీకాంత్‌రెడ్డి నాలుగున్నర ఎకరాల్లో పత్తి పంట వేశాడు. వర్షాల్లేక ఎండిపోవడంతో మనస్తాపం చెందిన అతడు పొలంలో పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విగత జీవిగా మారిన లక్ష్మీకాంత్ రెడ్డిని పోరుగు రైతులు సాయంత్రం గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement