'టీడీపీకి అంత సీన్ లేదు' | thammineni seetharam fires on tdp government | Sakshi
Sakshi News home page

'టీడీపీకి అంత సీన్ లేదు'

Sep 25 2015 5:49 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడే శక్తి అధికార తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడే శక్తి అధికార తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దాటికి తట్టుకోలేకనే ప్రత్యేక హోదాపై దీక్షను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్సీపీ వెనుకడుగు వేయదని తెలిపారు.   ప్రత్యేక హోదా ఆంధ్రప్రజల హక్కు అని ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం నినదించారు.

Advertisement
 
Advertisement
Advertisement