మునిసిపల్‌ ఉద్యోగి ప్రేమ వివాహం | Thadepalli Municipal Employee Love Marriage Tention In Office | Sakshi
Sakshi News home page

మునిసిపల్‌ ఉద్యోగి ప్రేమ వివాహం

Dec 13 2017 11:40 AM | Updated on Oct 16 2018 6:35 PM

Thadepalli Municipal Employee Love Marriage Tention In Office - Sakshi

వివాహం చేసుకున్న ప్రేమికులు

తాడేపల్లి (తాడేపల్లి రూరల్‌): తాడేపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగి ప్రేమ వివాహం చేసుకోగా మంగళవారం కార్యాలయంలో చిన్నపాటి ఉద్రిక్తత నెలకొంది. వధువు బంధువులు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేస్తుండగా చివరికి పెద్ద మనుషులు, పంచాయతీ, మున్సిపల్‌ కార్యాలయ అధికారుల జోక్యంతో విషయం పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

సేకరించిన వివరాల ప్రకారం.. తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడులో నివసిస్తున్న పడమర సాయి సంజీవ్‌హర్షిత్, విజయవాడ సత్యనారాయణపురంకు చెందిన అన్నాబత్తుల అంజలిప్రియదర్శిని 2012 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి విషయం తెలిసినా పెద్దలు అడ్డుచెప్పడంతో సోమవారం రాత్రి ఇద్దరూ సీతానగరంలోని సాయిబాబా గుడిలో వివాహం చేసుకున్నారు. మంగళవారం యువతి బంధువులు పోలీస్‌ స్టేషన్‌లో అభ్యంతరం చెప్పగా ఎస్సై ప్రతాప్‌కుమార్‌ సఖ్యత కుదిర్చారు. వారిద్దరికి తిరిగి పెద్దల సమక్షంలో తాడేపల్లి కృష్ణుడి దేవాలయంలో వివాహం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement