‘వైఎస్సార్‌ ఆశయాలను సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు’ | TG Venkatesh Comments On Rayalaseema Development | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ ఆశయాలను సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు’

Oct 1 2019 7:17 PM | Updated on Oct 1 2019 7:20 PM

TG Venkatesh Comments On Rayalaseema Development - Sakshi

సాక్షి, కర్నూలు : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాయలసీయ అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకు రావాలని కోరారు. రాజధాని, హైకోర్టు కోసం కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాల భూమి ఉందని తెలిపారు. కర్నూలుకు రాజధాని, హైకోర్టు ప్రకటిస్తే.. రాజధాని అభివృద్ధి చెందుతుందని అన్నారు. కర్నూలును అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement