అనంతపురం జిల్లాలో ప్రేమ వ్యవహారంపై ఉద్రిక్తత

Tension Over Love Marriage in Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో ప్రేమ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. లక్ష్మీ, రఘు అనే యువతి, యువకులు ప్రేమించుకుని ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్నారు. దీనిపై పెద్దలు పోలీసు స్టేషన్‌లో పంచాయతీ పెట్టించి ఆ జంటను విడదీశారు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. 

అనంతరం రఘు కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక టీడీపీ నేతలతో కలిసి లక్ష్మీని ఆమె తల్లిదండ్రులే హత్య చేశారంటూ తాడిపత్రి పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. పోలీసు జీపు అద్దాలను పగలగొట్టి స్టేషన్‌లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు మీడియా ప్రతినిధులపై దౌర్జనానికి పాల్పడ్డారు. ప్రేమ వ్యవహారాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top