‘పది’లో నూతన సంస్కరణలు | 'Ten' in the new versions of the | Sakshi
Sakshi News home page

‘పది’లో నూతన సంస్కరణలు

Mar 24 2014 2:17 AM | Updated on Sep 4 2018 5:07 PM

మాట్లాడుతున్న హైదరాబాద్ డీఈఓ సుబ్బారెడ్డి - Sakshi

మాట్లాడుతున్న హైదరాబాద్ డీఈఓ సుబ్బారెడ్డి

వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షల్లో నూతన సంస్కరణలు అమలులోకి రానున్నట్లు హైదరాబాద్ డీఈఓ, పూర్వపు కడప డీఈఓ సుబ్బారెడ్డి అన్నారు.

 వైవీయూ, న్యూస్‌లైన్ :  వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షల్లో నూతన సంస్కరణలు అమలులోకి రానున్నట్లు హైదరాబాద్ డీఈఓ, పూర్వపు కడప డీఈఓ సుబ్బారెడ్డి అన్నారు. కడపలోని బాలవికాస్ హైస్కూల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లోని ఒత్తిడిని తట్టుకునేందుకు మార్కుల స్థానంలో గ్రేడింగ్ వ్యవస్థను తీసుకు వచ్చారన్నారు. ఇష్టంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు.

 విద్యార్థులు  బట్టీ విధానానికి స్వస్తి చెప్పాలన్నారు. విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలని ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.వి. రామచంద్రారెడ్డి సూచించారు. పాఠశాల డెరైక్టర్ బి.గంగయ్య మాట్లాడారు. అనంతరం వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. పాఠశాల వ్యవస్థాపకుడు సుబ్బరాయుడు, అన్-ఎయిడెడ్ పాఠశాలల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఎలియాస్‌రెడ్డి, వెంకటరమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement