రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య | Teenager commits suicide | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య

Mar 12 2016 5:08 PM | Updated on Apr 7 2019 4:36 PM

పాతపట్నం మండలం సీతారాంపల్లి వద్ద రైలు కింద పడి ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పాతపట్నం ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉండే నడగాని స్వాతి(14) శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో విశాఖ వైపు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

పాతపట్నం (శ్రీకాకుళం) : పాతపట్నం మండలం సీతారాంపల్లి వద్ద రైలు కింద పడి ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పాతపట్నం ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉండే నడగాని స్వాతి(14) శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో విశాఖ వైపు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కారణంగా రైలును పావుగంటపాటు అక్కడే నిలిపివేశారు. స్వాతి మృతదేహాన్ని పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతురాలిది లక్ష్మీనర్సుపేట మండలం ఎంబ్రం పంచాయతీ బద్దవలస గ్రామమని సమాచారం. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement