అండగా ఉంటాం...ఉద్యమంలోకి రండి | teachers involved in the movement of the suppor | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం...ఉద్యమంలోకి రండి

Aug 25 2013 4:47 AM | Updated on Sep 1 2017 10:05 PM

జిల్లాలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనే ఉపాధ్యాయులకు ఎటువంటి వృత్తిపరమైన సమస్యలు ఎదురైనా తాము అండగా ఉంటామని,

 శ్రీకాకుళం/పాలకొండ రూరల్, న్యూస్‌లైన్:జిల్లాలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనే ఉపాధ్యాయులకు ఎటువంటి వృత్తిపరమైన సమస్యలు ఎదురైనా తాము అండగా ఉంటామని, అందరూ ఉద్యమంలో పాల్గొనాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఎన్‌జీఓ హోమ్‌లో సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలోని రిలే నిరిహార దీక్ష శిబిరాన్ని,   పాలకొండలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమ్మెకు పిలుపునిచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నప్పుడు కూడా వారు ఎటువంటి పిలుపునివ్వలేదని గుర్తు చేశారు.
 
 ఉపాధ్యాయులు సంఘాలకు అతీతంగా సమ్మెలో పాల్గొనాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలకు ఛీత్కారాలను ఎదుర్కొవాల్సి ఉంటుం దన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల వారు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించాలని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం పిలుపునిచ్చారు. రిలే నిరాహారదీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావాన్ని తెలియజేశారు. రాష్ట్ర సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తీసుకున్న ఉమ్మడి కార్యాచరణ ప్రతిపాదనను రాజశేఖరం స్వాగతించారు.
 
  ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్ బైరి అప్పారావు, టి.బి.ఎస్ శర్మ, డి.సుధారాణి, దుప్పల శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాస్, టి. తవిటినాయుడు, కోనే శ్రీధర్, వి.హరిశ్చంద్రుడు, బి.రవికుమార్, ఎ. రామారావు, బలివాడ సతీష్‌కుమార్, వై.బి.ఎస్ ప్రసాద్, తంగి మురళి, కె.శేషగిరిరావు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. జామి భీమశంకరారవు, పీఆర్ ఉద్యోగ సంఘ నాయకులు కె.నారాయణరావు, టీడీపీ నేత మజ్జి సీతారాములు ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement