నేటి నుంచి టీడీపీ పల్లెబాట | TDP's palle bata from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టీడీపీ పల్లెబాట

Nov 24 2013 6:52 AM | Updated on Aug 11 2018 4:08 PM

మండలంలోని చిర్రకుంట గ్రామం నుంచి ఆదివారం టీడీపీ పల్లెబాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ ప్రకటించారు.

మందమర్రి, న్యూస్‌లైన్ : మండలంలోని చిర్రకుంట గ్రామం నుంచి ఆదివారం టీడీపీ పల్లెబాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ ప్రకటించారు. శనివారం మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 25 రోజులపాటు పల్లెబాటు సాగుతుందని వివరించారు. చిర్రకుంట నుంచి సారంగపాణి, పొన్నారం, ఆదిల్‌పేట్, వెంకటాపూర్, ఎమ్మెల్యేకాలనీలను ఒక్క రోజులో పర్యటిస్తామని చెప్పారు. రోజుకు నాలుగు గ్రామాల చొప్పున 25 రోజుల్లో నియోజకవర్గంలోని 71 గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని వివరిస్తామని అన్నారు. గత రచ్చబండలో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, మూడో విడత నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. నాయకులు దార రవిసాగర్, సంగెపు హన్మంతు, పోరు సతీశ్, ఏదుల సంపత్, డాక్టర్ సారంగపాణి, సీహెచ్.సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement