రూ.50 లక్షలు నావని తేలితే రాజీనామా: సీఎం రమేష్ | tdp mp cm ramesh fires on media over cash for vote case | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షలు నావని తేలితే రాజీనామా: సీఎం రమేష్

Jun 17 2015 11:59 AM | Updated on Aug 17 2018 12:56 PM

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మరోసారి మీడియాపై మండిపడ్డారు. మీడియా తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఆయన బుధవారమిక్కడ ఎదురుదాడికి దిగారు.

హైదరాబాద్ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మరోసారి మీడియాపై మండిపడ్డారు. మీడియా తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఆయన బుధవారమిక్కడ ఎదురుదాడికి దిగారు. ఓటుకు కోట్లు కేసులో రూ.50 లక్షలు తనవని తేలితే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఏసీబీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు.  కాగా ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్న సీఎం రమేశ్కు నోటీసులు ఇచ్చేందుకు  ఏసీబీ సిద్ధం అవుతుంది. మరోవైపు ఈ కేసులో నోటీసులు అందుకున్న టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి  ..ఇవాళ ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement