విశాఖలో టీడీపీ మహానాడు | TDP Mahanadu in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో టీడీపీ మహానాడు

Apr 25 2017 12:43 AM | Updated on Oct 8 2018 5:28 PM

విశాఖలో టీడీపీ మహానాడు - Sakshi

విశాఖలో టీడీపీ మహానాడు

విశాఖపట్నంలో మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

టీడీపీ కార్యదర్శి టీడీ జనార్ధన్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.  ఇక్కడ మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నట్టు టీడీపీ కార్యదర్శి, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌ తెలిపారు. సోమవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రస్తుతం మండల కమిటీల ఏర్పాటు జరుగుతోందని ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీ ఎన్నిక జరుగుతుందని చెప్పారు. కాగా ఎన్టీఆర్‌ జన్మదినోత్సవం పురస్కరించుకుని మహానాడును జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement